హైదరాబాద్‌లో (Hyderabad) నేడు నిర్వహించాలనుకున్న జనసేన (Jana Sena Party) నవ నిర్మాణ సభకు (Nava Nirmana Sabha) తెలంగాణ పోలీసులు (Police) అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన నాయకులు తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించినప్పటికీ, కోర్టు హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించింది.
మొదటగా సభ నిర్వహణ కోసం సైబరాబాద్ పోలీసులను జనసేన నాయకులు సంప్రదించారు. అయితే భద్రతా(Security), పరిపాలనా (Administrative) కారణాలను చూపుతూ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన నేతలు అత్యవసర విచారణ కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్‌ను (House Motion Petition) దాఖలు చేశారు.
ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో పిటిషన్‌ను రిజిస్ట్రీ పరిశీలించింది. ఈ అంశం అత్యవసర విచారణకు అర్హమైనది కాదని, తక్షణ జోక్యం అవసరమయ్యే పరిస్థితులు ఇందులో లేవని పేర్కొంటూ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో సభ నిర్వహణకు న్యాయపరమైన మార్గం కూడా మూసుకుపోయింది.
హైకోర్టు తాజా నిర్ణయంపై జనసేన పార్టీ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. అయితే సభకు అనుమతి లభించని నేపథ్యంలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన కార్యాచరణలో మార్పులు చేసినట్లు సమాచారం.
మంగళవారం ఉదయం సామాజిక మాధ్యమ వేదికలో ప్రకటించినట్టుగానే సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో (Jubilee Hills Residence) మీడియా సమావేశం నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. నవ నిర్మాణ సభ స్థానంలో ఈ ప్రెస్‌మీట్ (Press Meet) ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంది.
హైకోర్టు నిర్ణయం జనసేన రాజకీయ కార్యక్రమాలపై తాత్కాలిక ప్రభావం చూపినప్పటికీ, పార్టీ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2026







