---Advertisement---

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నాన్-కోఆపరేషన్‌పై ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం!

September 30, 2026

Summarize with AI

---Advertisement---

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై కొనసాగుతున్న సహాయ నిరాకరణను (నాన్-కోఆపరేషన్) (Non-Cooperation) కొనసాగించాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) నిర్ణయించింది. ఈ మేరకు తమ అనుబంధ సంఘాల జనరల్ సభ్యులకు ఫెడరేషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (A.I.F.E.C.) సమావేశంలో జానీ మాస్టర్ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు ఫెడరేషన్ వెల్లడించింది.

గతంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఫెడరేషన్ నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫెడరేషన్ సభ్యుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలనే ఉద్దేశంతోనే జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

అదే సమయంలో, A.I.F.E.C. సమావేశంలోనూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు లభించిందని ఫెడరేషన్ తెలిపింది.

ఫెడరేషన్ నిర్ణయాన్ని అన్ని అనుబంధ సంఘాలు, వాటి నాయకులు, సభ్యులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment