---Advertisement---

భారత షూటింగ్ రంగంలో తీరని లోటు.. లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా కన్నుమూత

June 12, 2026

Summarize with AI

---Advertisement---

భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ షూటర్(Shooter), దిగ్గజ కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana) కన్నుమూశారు. ఆయన మృతివార్తను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధికారికంగా ప్రకటించింది. జస్పాల్ రాణా ఆకస్మిక మరణంతో దేశవ్యాప్తంగా క్రీడా అభిమానులు, షూటింగ్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

జర్మనీలోని (Germany) మ్యూనిచ్ నగరంలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ISSF) వరల్డ్‌కప్ పోటీల నుంచి తిరిగి వస్తున్న సమయంలో విమాన ప్రయాణంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అనంతరం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలువలేకపోయారు.

భారత షూటింగ్ చరిత్రలో జస్పాల్ రాణా ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. 2006 ఆసియా క్రీడల్లో దేశానికి స్వర్ణ పతకం (Gold Medal) అందించి భారత క్రీడా చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. షూటింగ్ క్రీడ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అపారమని క్రీడా నిపుణులు గుర్తుచేస్తున్నారు.

శూటింగ్ రంగంలో విశేష కృషి చేసినందుకు భారత ప్రభుత్వం (Government of India) ఆయనను ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది. క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా కోచ్‌గా కూడా అనేక మంది యువ షూటర్లను తీర్చిదిద్దిన జస్పాల్ రాణా మరణం భారత క్రీడా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment