---Advertisement---

ఎన్టీఆర్‌కు ముద్దు పెట్టిన వీరాభిమాని..వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

September 30, 2026

Summarize with AI

---Advertisement---

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) మరోసారి తన అభిమానులపై ఉన్న ప్రత్యేకమైన ప్రేమను (Love) చాటుకున్నారు. తనను కలవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఓ దివ్యాంగ అభిమానిని (Disabled Fan) స్వయంగా కలుసుకుని, ఎంతో ఆప్యాయంగా (Affectionately) పలకరించారు. తారక్ చూపించిన ఈ అభిమానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో ‘దేవర’ (Devara రీ-రిలీజ్ (Re-release) సందర్భంగా థియేటర్ వద్ద ఓ దివ్యాంగ అభిమాని ఎన్టీఆర్‌ను చూడాలన్న కోరికతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు మాట్లాడలేకపోవడం, వినలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ తారక్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. హైదరాబాద్‌లో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble) ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆ అభిమానిని ప్రత్యేకంగా తన కారవాన్‌లోకి ఆహ్వానించారు.

ఆ సమయంలో చేతికి గాయం కారణంగా ఎన్టీఆర్ ఆర్మ్ స్లింగ్ ధరించి ఉన్నారు. అభిమాని కారవాన్‌లోకి రాగానే తారక్ ఎంతో ఆప్యాయంగా పలకరించి, సైగల ద్వారా అతడి యోగక్షేమాలను తెలుసుకున్నారు.

అనంతరం ఫొటో దిగే సమయంలో ఆర్మ్ స్లింగ్ (Arm Sling) అడ్డుగా ఉండకూడదని భావించిన ఎన్టీఆర్.. చేతికి గాయం ఉన్నప్పటికీ దాన్ని స్వయంగా తొలగించారు. ఆ తర్వాత అభిమానిని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. తారక్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ అభిమాని కూడా ఎన్టీఆర్‌ను ముద్దాడటంతో అక్కడి వాతావరణం భావోద్వేగంగా మారింది.

అభిమాని కోసం తన గాయం, నొప్పిని సైతం పట్టించుకోకుండా ఎన్టీఆర్ చూపించిన ఆప్యాయత అభిమానులను ఆకట్టుకుంటోంది. తారక్, ఆ అభిమాని మధ్య చోటుచేసుకున్న ఈ అరుదైన క్షణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment