తెలంగాణలో (Telangana) భూముల (Lands) వ్యవహారంపై బీఆర్ఎస్( BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో రాష్ట్ర భూములు(State Lands) హారతి కర్పూరంలా(Camphor) కరిగిపోతున్నాయని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల (22A Prohibited Lands) అంశంపై తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
శాసనసభలో(Assembly) ప్రజా సమస్యలను (Public Issues) ప్రస్తావించకుండా తమ ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూముల వ్యవహారాల్లో అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో 22ఏ నిషేధిత జాబితాలో సుమారు 16 లక్షల ఎకరాలు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ విస్తీర్ణం కోటి 16 లక్షల ఎకరాలకు పెరిగిందని కేటీఆర్ ఆరోపించారు. దీంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశాన్ని రాహుల్ గాంధీ (Rahul Gandhi) దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
సిరిసిల్ల నియోజకవర్గంలోని (Sircilla Constituency) సముద్రలింగాపురంలో సుమారు 800 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో సమాంతర రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతోందని విమర్శించారు. సీఎం సోదరులు భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, మంత్రుల బృందం కూడా భూదందాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
గతంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమాచార హక్కు చట్టాన్ని(Right to Information Act) అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసేవారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల ఎకరాల భూములను అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో (Future City) రూ.200 కోట్ల విలువైన భూములను రూ.7 కోట్లకే కట్టబెట్టారని విమర్శించారు.
కేసీఆర్(KCR) హయాంలో సాగునీటి వసతులు మెరుగుపరచడం ద్వారా ఎకరం రూ.5 లక్షలుగా ఉన్న భూముల విలువను రూ.50 లక్షలకు పెంచామని కేటీఆర్ తెలిపారు. కొంగర కలాన్‌లో కలెక్టరేట్ నిర్మాణంతో భూముల ధరలు పెరిగాయని అన్నారు. రాబోయే 2 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్.. 22ఏ జాబితాలో ఉన్న భూములను రైతుల ప్రయోజనాల కోసం కాపాడుకుంటామని స్పష్టం చేశారు.








