అసెంబ్లీ (Assembly) ప్రవేశ ద్వారం వద్ద జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలపై(MLCs) లైంగిక వేధింపుల కేసులు (Sexual Harassment Cases) నమోదు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు. ప్రజాప్రతినిధులపై ఇలాంటి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.
ఓ మంత్రి (Minister) తన పరిధిలోని పోలీసులను(Police) ఉపయోగించుకుని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈ కేసులు నమోదు చేయించారని కేటీఆర్ ఆరోపించారు. చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.
ఈ అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న ఘటనను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. తమపై నమోదైన కేసులను న్యాయస్థానంలో(Court) ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
అదే సమయంలో తెలంగాణ డీజీపీని(DGP) ఉద్దేశించి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్లో (Hyderabad) జరిగిన మిస్ వరల్డ్ (Miss World) పోటీల సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ నాయకులపై మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
ఆ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తెలంగాణ పోలీసులు ఇంకా కాపాడుతూనే ఉంటారా అని కేటీఆర్ నిలదీశారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్న ఆయన, ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of law
— KTR (@KTRBRS) September 12, 2026
We of course will fight this rubbish cases in court of law
But let me ask @TelanganaDGP Garu… pic.twitter.com/dGxvJrSibA








