---Advertisement---

15 ఏళ్ల నిరీక్షణ.. రాజమౌళితో సినిమా గురించి మహేష్ బాబు ఆసక్తికర విషయాలు!

September 15, 2026

Summarize with AI

---Advertisement---

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) కలయికలో తెరకెక్కుతున్న వారణాసి (Varanasi) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్(Priyanka Chopra Jonas), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలిసారి మహేష్, రాజమౌళి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

తాజాగా ఓ విదేశీ పాడ్‌కాస్ట్‌లో (Foreign Podcast) పాల్గొన్న మహేష్ బాబు, రాజమౌళితో తన పరిచయం, వారణాసి సినిమా కోసం ఎదురుచూసిన సుదీర్ఘ సమయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మగధీర సినిమా విడుదలైన తర్వాత దాదాపు 15 ఏళ్ల క్రితమే రాజమౌళిని కలిసినట్లు మహేష్ తెలిపారు. అప్పట్లో రాజమౌళి ఇంటికి వెళ్లి కలిసి సినిమా చేద్దామని చెప్పానని గుర్తుచేసుకున్నారు. తన చేతిలో మరో 2 సినిమాలు ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత సినిమా చేద్దామని రాజమౌళి చెప్పారని, అయితే ఆ 2 సినిమాలు పూర్తయ్యేలోపే ఏకంగా 15 సంవత్సరాలు గడిచిపోయాయని మహేష్ బాబు సరదాగా చెప్పారు.

ఇక రాజమౌళితో పనిచేయడం చాలా కష్టమని కొంతమంది నటులు, స్నేహితులు ముందుగానే తనను భయపెట్టారని మహేష్ వెల్లడించారు. అయితే ఆయనతో పనిచేసిన తర్వాత తనకు మాత్రం అలా అనిపించలేదన్నారు. రాజమౌళి నిర్వహించే రిహార్సల్స్, పక్కా ప్రణాళిక, ముందస్తు సన్నాహాల వల్ల షూటింగ్ ప్రక్రియ చాలా సులభంగా, సరదాగా సాగుతోందని తెలిపారు.

రాజమౌళి పని చేసే విధానానికి తాను పూర్తిగా అలవాటు పడిపోయానని మహేష్ చెప్పారు. ఇకపై ఇతర దర్శకులతో సినిమాలు చేసేటప్పుడు వారి పని విధానం తనకు కొంత భిన్నంగా అనిపించవచ్చేమోనని సరదాగా వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment