బాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో సినిమాల్లోకి వచ్చిన నోరా ఫతేహీకి(Nora Fatehi) స్పెషల్ సాంగ్స్‌నే స్టార్డమ్ తీసుకొచ్చాయి. తెలుగులో ‘టెంపర్’ సినిమాలోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ పాటతో ఒక్కసారిగా పాపులర్ అయిన నోరా.. ఆ తర్వాత వరుస స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించింది.
హీరోయిన్గా చేసిన సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్‌తోనే(Special Songs) నోరాకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. దీంతో ఈ తరహా పాటల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇటీవల తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గడంతో ఇతర భాషల సినిమాలపై ఫోకస్ పెడుతోంది.
తాజాగా నోరా ఫతేహీ ‘జైలర్ 2’(Jailer 2) సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో పూర్ణ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించగా.. ఇప్పుడు నోరా ఫతేహీతో మరో ప్రత్యేక పాటను చిత్రబృందం రూపొందించినట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో తమన్నా భాటియా ‘నువ్వు కావాలయ్యా’ పాటతో సినిమాకు మరింత కమర్షియల్ క్రేజ్ తీసుకొచ్చింది. అదే తరహాలో ‘జైలర్ 2’లో నోరా ఫతేహీ స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ పాటలో నోరా తన గ్లామర్‌తో పాటు డ్యాన్స్‌తో సందడి చేయనున్నట్లు సమాచారం. ఆమె లుక్, డ్యాన్స్ మూవ్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. గతంలో స్పెషల్ సాంగ్స్ విషయంలో ఎదురైన విమర్శల నేపథ్యంలో ఈసారి పాట చిత్రీకరణ విషయంలో చిత్రబృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరి ‘జైలర్ 2’లో నోరా ఫతేహీ స్పెషల్ సాంగ్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ పాటతో నోరాకు మళ్లీ వరుస అవకాశాలు వస్తాయా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.







