సెప్టెంబర్‌లో కాస్త నెమ్మదించిన టాలీవుడ్‌కు అక్టోబర్ (October) నెలలో సినిమాల సందడి మొదలుకానుంది. దసరా సెలవులను దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోల (Star Heroes) సినిమాలు వరుసగా థియేటర్లలోకి రానున్నాయి. దీంతో అక్టోబర్‌లో బాక్సాఫీస్ (Box Office) వద్ద పోటీ ఆసక్తికరంగా మారనుంది.
అక్టోబర్ 2న రాజమౌళి (Rajamouli) ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’(Don’t Trouble the Trouble) విడుదల కానుంది. అదే రోజున జానస్ సంజయ్ హీరోగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’(Sigma), ఆది సాయికుమార్ నటించిన ‘ఎస్‌ఐ యుగంధర్’(SI Yugandhar), ‘తెల్లకాగితం’(Tellakagitham) సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
దసరా సెలవులను క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలు తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’(Adarsha Kutumbam) అక్టోబర్ 9న విడుదల కానుంది. అదే రోజున శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’(Comrade Kalyan) అనే యాక్షన్ కామెడీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
అక్టోబర్ 15న రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ (Jailer 2) థియేటర్లలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరుసటి రోజే విజయ్ దేవరకొండ ‘రణబాలి’(Ranabali) అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక అక్టోబర్ 17న ఆనంది నటించిన ‘గరివిడి లక్ష్మీ’ విడుదల కానుంది.
దసరా తర్వాత కూడా టాలీవుడ్‌లో సినిమా సందడి కొనసాగనుంది. విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్న ‘కల్ట్’(Cult) అక్టోబర్ 30న విడుదల కానుంది. ఇప్పటివరకు వయొలెన్స్, థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న శైలేష్ కొలను ఈసారి ‘ఏమో ఏమో ఇది’ అనే రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రోషన్, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన ఈ చిత్రం కూడా అక్టోబర్ చివర్లో విడుదల కానుంది.
అదే అక్టోబర్ 30న అనీష్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఇట్లు అర్జున’(Itlu Arjuna) కూడా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.
మొత్తంగా అక్టోబర్‌లో స్టార్ హీరోల చిత్రాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా వరుసగా విడుదల కానుండటంతో టాలీవుడ్‌లో సందడి నెలకొననుంది. ముఖ్యంగా దసరా సీజన్‌లో థియేటర్లకు వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.







