---Advertisement---

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం!

August 29, 2026

Summarize with AI

---Advertisement---

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా డ్రోన్ దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 27 మంది మృతి చెందగా.. సుమారు 50 నివాస భవనాలు దెబ్బతిన్నాయి.

కీవ్ పశ్చిమ శివార్లలోని మైలా పట్టణంలో ఓ డ్రోన్ గిడ్డంగిని ఢీకొట్టడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. గిడ్డంగిలో మంటలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కీవ్ ప్రాంత గవర్నర్ తైమూర్ ట్కాచెంకో వెల్లడించారు.

గిడ్డంగిలో పేలుడు పదార్థాలున్నాయా?

రష్యా డ్రోన్ దాడికి గురైన గిడ్డంగిలో పేలుడు పదార్థాలు నిల్వ చేసి ఉండొచ్చని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు అనుమానిస్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి సామగ్రి నిల్వ చేశారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై సంస్థ నిర్లక్ష్యం కారణమైందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రకారం.. ఆగస్టు 28న రాత్రి సుమారు 8.10 గంటలకు ఓ డ్రోన్ మైలా పట్టణంలోని ఓ సంస్థ ప్రాంగణంపై పడింది లేదా ఢీకొట్టింది. దీంతో భారీ అగ్నిప్రమాదం, వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

సంస్థపై దర్యాప్తు

గిడ్డంగిలో పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని నిల్వ చేసేందుకు సంస్థకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగా వాటిని నిల్వ చేశారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో డిమిత్రివ్స్కా గ్రామ మేయర్ తారస్ డిడిచ్ కూడా ఉన్నట్లు కీవ్ ప్రాంత గవర్నర్ తెలిపారు.

మరింత తీవ్రంగా దాడులు

ఇటీవలి నెలల్లో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లతో దాడులను తీవ్రతరం చేశాయి. ఈ దాడుల్లో పౌరుల ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది. తాజాగా కీవ్‌పై జరిగిన దాడి యుద్ధ తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment