---Advertisement---

సైమా అవార్డ్స్ 2026 విజేతలు వీరే.. అవార్డులు గెలుచుకున్న సినిమాలివే!

September 13, 2026

Summarize with AI

---Advertisement---

సైమా అవార్డ్స్ 2026 (SIIMA Awards 2026) వేడుక బెంగళూరులోని(Bengaluru) కోరమంగళ ఇండోర్ స్టేడియంలో(Koramangala Indoor Stadium) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక వేడుకలో తెలుగు(Telugu), కన్నడ (Kannada) చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

గత ఏడాది ప్రేక్షకులను అలరించిన విజయవంతమైన చిత్రాలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలు కూడా వివిధ విభాగాల్లో అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.

సైమా అవార్డ్స్ 2026లో పురస్కారాలు అందుకున్న విజేతలు, సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.

  1. ఉత్తమ నటుడు (కన్నడ) – రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్ 1)
  2. ఉత్తమ సహాయ నటుడు – సత్యదేవ్ (కింగ్‌డమ్)
  3. ఉత్తమ నటుడు – తేజ సజ్జా (మిరాయ్)
  4. ఉత్తమ నటుడు – నాగచైతన్య (తండేల్)
  5. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – చందూ మొండేటి (తండేల్)
  6. ఉత్తమ చిత్రం – మిరాయ్
  7. ఉత్తమ దర్శకుడు – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
  8. ఉత్తమ సహాయ నటుడు – మంచు మనోజ్ (సంక్రాంతికి వస్తున్నాం)
  9. ఎంటర్‌టైనర్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – సంక్రాంతికి వస్తున్నాం
  10. బెస్ట్ ఎంటర్‌టైనర్ – వెంకటేష్ (సంక్రాంతికి వస్తున్నాం)
  11. ఉత్తమ నటి (క్రిటిక్స్) – ఐశ్వర్య రాజేష్ (సంక్రాంతికి వస్తున్నాం)
  12. ఉత్తమ సహాయ నటి – శ్రద్ధా శ్రీనాథ్ (డాకు మహారాజ్)
  13. ఉత్తమ హాస్యనటుడు – భీమల రేవంత్ / బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)
  14. ఉత్తమ సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
  15. ఉత్తమ నేపథ్య గాయకుడు – రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
  16. ఉత్తమ నేపథ్య గాయని – సమీరా భరద్వాజ్ (కోర్ట్)
  17. ఉత్తమ నటుడు – హర్ష రోషన్ (కోర్ట్)
  18. ఉత్తమ నటి – శ్రీదేవి (కోర్ట్)
  19. ఉత్తమ నటి – సాక్షి మడోల్కర్ (మోగ్లీ)
  20. ఉత్తమ గేయ రచయిత – పూర్ణాచారి (కోర్ట్)

సైమా అవార్డ్స్ 2026లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అవార్డులు అందుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా మిరాయ్(Mirai), సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam), తండేల్(Thandel), కోర్ట్(Court) చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు అందుకుని ప్రత్యేకంగా నిలిచాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment