కోలీవుడ్ స్టార్ హీరో కార్తి(Karthi), దర్శకుడు పీఎస్ మిత్రన్ (P. S. Mithran) కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్-2’ (Sardar 2) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కార్తి నటించిన విజయవంతమైన చిత్రం ‘సర్దార్’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రంలో కార్తికి జోడీగా మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటించారు. ఎస్.జె. సూర్య, రజిషా విజయన్ కీలక పాత్రల్లో కనిపించారు. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ‘సర్దార్-2’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని అందుకోలేకపోయింది.
థియేట్రికల్ రన్ (Theatrical Run) పూర్తికాకముందే ‘సర్దార్-2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ(OTT) హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 1 నుంచి ‘సర్దార్-2’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. దీంతో థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇక ఓటీటీలో ‘సర్దార్-2’ను వీక్షించవచ్చు.







