---Advertisement---

రస్టిక్ లుక్‌లో శర్వానంద్ ‘భోగి’ టీజర్ రిలీజ్!

October 4, 2026

Summarize with AI

---Advertisement---

శర్వానంద్ (Sharwanand) హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోగి’(Bhogi). సినిమా ప్రకటనతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ.. తాజాగా విడుదలైన టీజర్‌తో(Teaser) అంచనాలను మరింత పెంచింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్(Sri Sathya Sai Arts) బ్యానర్‌పై కేకే రాధామోహన్ (KK Radhamohan) నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

‘భోగి’ సినిమాలో శర్వానంద్ ‘గంగ’(Ganga) అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ తరహా పాత్రలతో ఆకట్టుకున్న శర్వానంద్.. ఈసారి పూర్తిగా భిన్నమైన మాస్ అవతార్‌లో(Mass Avatar) కనిపించనున్నారు. రగ్గడ్ లుక్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌లో ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

‘భోగి’ని రా, రస్టిక్, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకుని తనదైన మాస్ టేకింగ్‌తో కథను రూపొందించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘భోగి’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అనుకోని కారణాలతో విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం నవంబర్ 13న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment