దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ఆదరణ పొందిన జంట సూర్య(Suriya), జ్యోతిక(Jyothika). తమ వివాహ బంధానికి 20 ఏళ్లు (20 Years) పూర్తయిన సందర్భంగా ఈ జంట మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన వీడియోను జ్యోతిక సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.
సూర్య, జ్యోతిక 2006 సెప్టెంబర్ 11న వివాహ బంధంతో(Marriage) ఒక్కటయ్యారు. 20 ఏళ్ల వైవాహిక జీవితాన్ని గుర్తుండిపోయేలా జరుపుకునేందుకు విదేశాల్లోని (Abroad) ఓ అందమైన చర్చిలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిక తెల్లటి వివాహ దుస్తుల్లో మెరవగా, సూర్య తెల్లటి కోటు, నల్లటి ప్యాంటుతో కనిపించారు.
జ్యోతిక తన కుమారుడు దేవ్ (Dev) చేయి పట్టుకుని వివాహ వేదిక వద్దకు రాగా.. ఆమెను చూసిన సూర్య భావోద్వేగానికి(Emotional) గురైన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. కుమార్తె దియా(Diya), కుమారుడు దేవ్(Dev), సూర్య సోదరుడు కార్తితో(Karthi) పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ వీడియోను పంచుకున్న జ్యోతిక.. తమ 20 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన మనస్పర్థలు, సర్దుబాట్లు, త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా ఈ వేడుకను నిర్వహించుకున్నామని తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సూర్య చివరిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో కనిపించారు. మమిత బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రం 2026 ఆగస్టు 14న విడుదలైంది. ప్రస్తుతం జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ చిత్రంతో పాటు, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందనున్న సూర్య 48లోనూ ఆయన నటించనున్నారు.
20 ఏళ్ల వైవాహిక బంధాన్ని సూర్య, జ్యోతిక ఇలా ప్రత్యేకంగా జరుపుకోవడంతో ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.






