---Advertisement---

తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బ రిలేషన్‌ నిజమేనా? వినాయక చవితి ఫొటోలతో పెరిగిన ఆసక్తి!

September 14, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్‌లో దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker), హీరోయిన్ ఈషా రెబ్బ (Eesha Rebba) పేర్లు కొంతకాలంగా ప్రేమాయణం (Love Affair) వార్తల్లో వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందంటూ ప్రచారం జరుగుతున్నా.. తమ బంధంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. తాజాగా వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో మరోసారి ఈ విషయంపై చర్చ మొదలైంది.

వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి గణపయ్యకు పూజలు (Lord Ganesha Puja) చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఈ పరిణామం తమ బంధంపై ఇచ్చిన సంకేతమా? అంటూ చర్చించుకుంటున్నారు.

గత కొంతకాలంగా వీరిద్దరూ త్వరలో పెళ్లి (Marriage) చేసుకోబోతున్నారంటూ సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ‘ఓం శాంతి శాంతిః’ సినిమా సమయంలోనే తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ మధ్య మంచి పరిచయం ఏర్పడిందని, అది క్రమంగా సన్నిహిత సంబంధంగా మారిందని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో ప్రేమాయణం వార్తలు మరింత ఊపందుకున్నాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బ తన వ్యక్తిగత జీవితం (Personal Life) గురించి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం ఒకరితో ప్రేమలో(Love) ఉన్నానని, అయితే ఆ బంధం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె చెప్పలేదు.

తాజాగా తరుణ్ భాస్కర్‌తో కలిసి పండుగ వేడుకల్లో కనిపించడంతో ఈషా గతంలో చెప్పిన ఆ వ్యక్తి తరుణ్ భాస్కరే అయి ఉంటారని అభిమానులు, నెటిజన్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ తమ బంధంపై అధికారిక ప్రకటన చేస్తారా? పెళ్లి వార్తలను నిజం చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది. అయితే వారి నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను కేవలం ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment