---Advertisement---

చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు.. బాడీ షేమింగ్‌పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు!

September 13, 2026

Summarize with AI

---Advertisement---

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి, అపోలో సంస్థల బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన కొణిదెల (Upasana Konidela) తన జీవితంలో ఎదుర్కొన్న బాడీ షేమింగ్(Body Shaming), ట్రోలింగ్ (Trolling) గురించి తాజాగా వెల్లడించారు. రామ్ చరణ్‌తో వివాహం (Marriage) జరిగిన తొలినాళ్లలో ‘చరణ్‌కు సరైన జోడీ కాదు.. చాలా లావుగా ఉంది.. చరణ్ పక్కన నువ్వేం సెట్(Set) అవుతావ్’ అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు.

ఉన్నత చదువుల కోసం అమెరికా (America) వెళ్లిన సమయంలో కుటుంబానికి దూరంగా ఉండటంతో తీవ్రంగా ఇంటి బెంగకు (Homesickness) గురయ్యానని, ఆ మానసిక ఒత్తిడి (Mental Stress) కారణంగా ఎక్కువగా తినడం ప్రారంభించానని ఉపాసన చెప్పారు. దీంతో 18 ఏళ్ల వయసులో తన బరువు (Weight) 95 కిలోలకు చేరిందని వెల్లడించారు.

ఆ తర్వాత ఆహారపు అలవాట్లలో(Food Habits) మార్పులు చేసుకోవడంతో పాటు ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవడం ద్వారా బరువు తగ్గానని తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి వ్యాయామం (Exercise) చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

తాను, తన తల్లి నిద్రలేమి సమస్యతో(Insomnia Problem) బాధపడుతున్నామని, రోజుకు 4 గంటలకు మించి నిద్రపోలేకపోతున్నట్లు ఉపాసన వెల్లడించారు. నిద్రలేమిపై అవగాహన కల్పించేందుకు త్వరలో ప్రత్యేకంగా నిద్ర క్లినిక్‌ను(Sleep Clinic) ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో(Self-Confidence) ముందుకు సాగడం ఎంతో ముఖ్యమని ఉపాసన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment