మహేష్ బాబు(Mahesh Babu), ఎస్ఎస్ రాజమౌళి(S.S. Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసిపై (Varanasi) అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా తెలుగు హక్కులు(Telugu Rights) రూ.350 కోట్లకు ఖరారయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తెలుగు హక్కుల కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో(Dil Raju) పాటు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహేష్ బాబు స్టార్డమ్, రాజమౌళి క్రేజ్ కారణంగా తెలుగు హక్కులకు భారీ డిమాండ్ ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూ.350 కోట్ల కంటే కూడా హక్కుల విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా.
దాదాపు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్తో(Huge Budget) తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది. తెలుగు హక్కులతో పాటు ఇతర భాషలు, డిజిటల్, ఉపగ్రహ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమా వ్యాపార పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.






