---Advertisement---

పవన్ కళ్యాణ్‌పై పెరుగుతున్న అసహనం? ప్రజల మనసులో మారుతున్న అభిప్రాయం!

June 15, 2026

Summarize with AI

---Advertisement---

జనసేన(Jana Sena) అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యవహార శైలిపై ప్రజల్లో అసహనం పెరుగుతోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వం (Government) తీసుకున్న నిర్ణయాలపై అసత్యాలతో, అర్ధసత్యాలతో తీవ్ర విమర్శలు చేస్తూ, అధికారంలోకి వస్తే ప్రతి వర్గానికి న్యాయం చేస్తానని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తానని ప్రజలకి హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రజలు ఆశించిన స్థాయిలో స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ప్రజా సమస్యల కంటే జాతీయ అంశాలు, సనాతన ధర్మం(Sanatana Dharma), ఇతర రాష్ట్రాల రాజకీయాలపై ఎక్కువగా స్పందిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా దృష్టిని ఆకర్షించే అంశాలపై చురుకుగా వ్యవహరిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలపై తగిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది.

ఉప్పాడ మత్స్యకారుల (Fishermen) సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా నెలలు గడిచినా స్పష్టమైన ఫలితాలు కనిపించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే కాపు కార్పొరేషన్ (Kapu Corporation) నిధుల అంశం, బెల్ట్ షాపులు (Belt Shops), ఇసుక-మట్టి-గ్రావెల్ అక్రమాలు(Sand-Soil-Gravel-(Illegal Activities), పేకాట క్లబ్బులు(Gambling Clubs), మట్కా వంటి సమస్యలపై కూడా ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక స్టీల్ ప్లాంట్ (Steel Plant), పోలవరం ప్రాజెక్టు(Polavaram Project), పరిశ్రమల ఏర్పాటు(Industries), ఆర్థిక వ్యవహారాలు, టెండర్ల ప్రక్రియ వంటి కీలక అంశాలపై తాను పూర్తి అవగాహన లేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యల మధ్య వ్యత్యాసం ప్రజల్లో సందేహాలను పెంచుతోందని వారు అంటున్నారు.

అదే సమయంలో జనసేనకు(Jana Sena) చెందిన కొందరు నాయకులపై మహిళలకు సంబంధించిన ఆరోపణలు రావడం, వాటిపై పార్టీ అధినాయకత్వం నుంచి బలమైన స్పందన కనిపించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మహిళల పట్ల నాయకుల వ్యవహార శైలి, కొన్ని సంఘటనలపై స్పందించిన తీరు పార్టీ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా జాతీయ రాజకీయాల్లో ఎక్కువ చురుకుగా ఉన్నట్టు కనిపించడం వల్ల పవన్ కళ్యాణ్ ప్రజల్లో నిర్మించుకున్న ఇమేజ్ క్రమంగా దెబ్బతింటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కార్యకర్తలు దీనిని భిన్నంగా చూడవచ్చుగానీ, సాధారణ ప్రజలు (Common People) ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, సమస్యల పరిష్కారం వంటి అంశాల ఆధారంగానే నాయకత్వాన్ని అంచనా వేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment