డెస్చ్రిప్తిఒన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు మిస్సింగ్ కేసుగా(Missing Case) భావించిన ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) అధికారికంగా కస్టడీయల్ డెత్ కేసుగా (Custodial Death Case) గుర్తించి కోర్టుకు(Court) నివేదిక సమర్పించింది. విజయవాడ (Vijayawada) 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
సిట్ వివరాల ప్రకారం, సాయికృష్ణను మే 6న మార్కాపురంలో అదుపులోకి తీసుకుని అనంతరం కృష్ణలంక (Krishnalanka) సీఐ నాగరాజుకు (CI Nagaraju) అప్పగించారు. అయితే చట్టం ప్రకారం 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ అలా చేయలేదని పేర్కొన్నారు. నాన్-బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కోర్టు ముందు ప్రవేశపెట్టకపోవడం తీవ్ర ఉల్లంఘనగా సిట్ పేర్కొంది.
దర్యాప్తులో భాగంగా విచారించిన సాక్షుల్లో ఒక ఎస్సై, సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో కస్టడీలో చూసినట్లు, అనంతరం అతని మృతదేహాన్ని కూడా చూసినట్లు వాంగ్మూలం ఇచ్చినట్టు వెల్లడైంది. సాయికృష్ణ పోలీస్ కస్టడీలోనే మరణించాడని, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసినట్లు అనుమానిస్తున్నామని సిట్ కోర్టుకు తెలిపింది.
మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజీలు CCTV Footage) లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ ఫుటేజీలను ఎవరు, ఎందుకు తొలగించారన్నది ఇంకా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మే 6 నుంచి 8 మధ్య సాయికృష్ణను చూసినట్లు ఒక ఈ-కామర్స్ డెలివరీ బాయ్ ఇచ్చిన వాంగ్మూలం కూడా దర్యాప్తులో కీలకంగా మారింది.
కోర్టు ముందు సిట్(SIT) పలు ప్రశ్నలను ఉంచింది. సాయికృష్ణను ఎందుకు కోర్టులో హాజరుపరచలేదు? కస్టడీలో మరణించిన తర్వాత మృతదేహాన్ని ఏమి చేశారు? సీసీటీవీ ఆధారాలను ఎందుకు మాయం చేశారు? అనే అంశాలపై సమాధానాలు లభిస్తేనే కేసు పూర్తిస్థాయిలో ఛేదించగలమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కోర్టు సస్పెండ్ అయిన సీఐ నాగరాజుకు(CI Nagaraju) 14 రోజుల రిమాండ్ విధించి జులై 8న మళ్లీ హాజరుపరచాలని ఆదేశించింది. ఇప్పటికే సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్, సిట్ దర్యాప్తు, కోర్టులో వెల్లడైన తాజా వివరాలు ఈ కేసును మరింత కీలక దశకు తీసుకెళ్లాయి. రిమాండ్ రిపోర్ట్‌లో నమోదైన అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, పోలీస్ వ్యవస్థలపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.






