---Advertisement---

కూటమి తీరుతో డ్వాక్రా మహిళలకు ఆరు వేల కోట్ల నష్టం?.. జగన్ బయటపెట్టిన సంచలన లెక్కలు.

June 25, 2026

Summarize with AI

---Advertisement---

టీడీపీ-జనసేన (TDP-Jana Sena Party) కూటమి ప్రభుత్వం (Alliance Government) ఎన్నికల సమయంలో డ్వాక్రా (DWCRA) మహిళలకు(Women) ఇచ్చిన కీలక హామీలను (Promises) అమలు చేయకుండా విస్మరించిందని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (Y.S. Jagan Mohan Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ (Interest Subsidy) పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో (Election Manifesto) హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆయన విమర్శించారు.

జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రాయితీ పథకానికే గత రెండేళ్లుగా నిధులు (Funds) విడుదల కాలేదని ఆరోపించారు. 2024-25లో వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని, 2025-26 మరియు 2026-27 ఆర్థిక సంవత్సరాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినప్పటికీ వాటి విడుదలపై స్పష్టత లేదని పేర్కొన్నారు.

మహిళల చేతిలో నిధులు ఉంటే స్వయం ఉపాధి(Self Employment), చిన్న వ్యాపారాలు(Small Businesses), ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని జగన్ వివరించారు. వడ్డీ రాయితీ అమలు చేయకపోవడం వల్ల ఒక్కో స్వయం సహాయక సంఘానికి సగటున రూ.6 లక్షల రుణభారం ఉన్న నేపథ్యంలో, కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అందాల్సిన ప్రయోజనాల్లో రెండేళ్లలో సుమారు రూ.6,000 కోట్లు మహిళలకు అందకుండా పోయాయని ఆయన లెక్కలు వివరించారు.

అలాగే, వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రభుత్వ (Government) హయాంలో వడ్డీ రాయితీ రూపంలో రూ.4,969 కోట్లు చెల్లించడంతో పాటు ‘ఆసరా’(YSR Aasara), ‘చేయూత’(YSR Cheyutha) వంటి పథకాల ద్వారా మహిళలకు భారీ ఆర్థిక (Financial Support) మద్దతు అందించామని గుర్తు చేశారు. ఈ చర్యల వల్ల స్వయం సహాయక సంఘాలకు అందే రుణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైందని తెలిపారు.

అయితే ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొంటూ, 2023-24లో స్వయం సహాయక సంఘాలకు అందిన రుణాలు రూ.49,696 కోట్లుగా ఉండగా, 2024-25లో అవి రూ.41,623 కోట్లకు, 2025-26లో రూ.41,105 కోట్లకు తగ్గిపోయాయని జగన్ పేర్కొన్నారు. రుణాల వృద్ధి తగ్గడం అంటే పెట్టుబడులు, ఆదాయాలు, వినియోగం తగ్గినట్లేనని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభానికి సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయ వృద్ధి రేటు 3.22 శాతంగా నమోదవడం కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని సూచిస్తోందని జగన్ పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ఆర్థిక మద్దతు తగ్గడం వల్ల గ్రామీణ కుటుంబాల ఆదాయాలు, ఉపాధి అవకాశాలు మరియు స్థానిక ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన ఆరోపించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment