తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) మరోసారి వివాదం చెలరేగింది. ముఖ్యమంత్రి విజయ్(Vijay), నటి త్రిషను (Trisha) ఉద్దేశిస్తూ డీఎంకే(DMK) ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ (Anitha R. Radhakrishnan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారంటూ తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జూన్ 20న తూత్తుకుడి జిల్లా (Thoothukudi District) ఆత్తూరులో జరిగిన సంక్షేమ కార్యక్రమంలో మాట్లాడిన అనితా రాధాకృష్ణన్(Anitha R. Radhakrishnan), సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అసెంబ్లీలో (Assembly) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానించారు. అలాగే విజయ్, త్రిష పేర్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.
తాను వ్యాపారవేత్తనని చెబుతూ, వ్యక్తి ముఖం చూసి అతని పరిస్థితిని అంచనా వేయగలనని ఉదాహరణ ఇచ్చిన ఆయన, అసెంబ్లీలో విజయ్(Vijay) హావభావాలు చూస్తే పెద్ద సమస్యలో ఉన్నట్లు కనిపించిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో టీవీకే(TVK) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్, త్రిష వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ వేదికపైకి తీసుకురావడం అభ్యంతరకరమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోతో ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది. అనంతరం జూన్ 24, 25 తేదీల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆత్తూరు పోలీసులు అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో డీఎంకే(DMK), టీవీకే(TVK) మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్నాయి.








