అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సామాజిక మాధ్యమం ‘ఎక్స్'(X) వేదికగా సందేశం విడుదల చేశారు. డ్రగ్స్‌పై(Drugs) పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడటమేనని పేర్కొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) డ్రగ్ ట్రాఫికింగ్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.
అయితే ముఖ్యమంత్రి(CM) చేసిన ఈ ప్రకటనపై రాష్ట్రంలోని పలువురు సామాజిక వేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్రాన్ని గంజాయి (Cannabis) రహితంగా మారుస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని వారు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే గతంతో పోలిస్తే గంజాయి వినియోగం, అక్రమ రవాణా మరింత పెరిగినట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా, గంజాయి (Cannabis) మాత్రమే కాకుండా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు కూడా ఈ ప్రభుత్వ (Government) హయాంలో పెరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ(Vijayawada, గుంటూరు(Guntur) వంటి నగరాల్లో మాదకద్రవ్యాల కేసుల్లో యువత తరచుగా పట్టుబడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఇక అధికార పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ(Eluru MP) పుట్టా మహేష్ (Putta Mahesh) హైదరాబాద్‌లో జరిగిన మాదకద్రవ్యాల కేసులో డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవైపు సోషల్ మీడియా వేదికలపై “డ్రగ్స్ వద్దు” అంటూ ప్రచారం చేస్తూనే, మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలకు తావిస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు.






