జనసేన(Jana Sena) అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన “సంక్షేమ పథకాలతోనే (Welfare Schemes) ఎన్నికల్లో (Elections గెలవలేం” అనే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సంక్షేమ పథకాలను ఓట్లతో ముడిపెట్టి మాట్లాడటం ద్వారా పవన్ కల్యాణ్ తన రాజకీయ ఆలోచనా విధానాన్ని బయటపెట్టుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో పేద(Poor), బడుగు, బలహీన వర్గాలకు (Weaker Sections) సంక్షేమ పథకాలు అందించడం ఆర్థిక వ్యవస్థకు భారం (Economy Burden) కాదని, అది సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడిగా చూడాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాల్సి ఉంటుందని, దానికి సంక్షేమ పథకాలే కీలకమని వారు వివరిస్తున్నారు.
ఎన్నికల (Election) సమయంలో అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని (Welfare Scheme) కూడా నిలిపివేయబోమని, వాటితో పాటు మరిన్ని పథకాలను అమలు చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చవని చెప్పడం ఎన్నికల హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నంగానే కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విద్య, వైద్యం వంటి అంశాలు ప్రజల ప్రాథమిక హక్కులుగా పరిగణించబడుతున్నాయని, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై వాటి భారం పడకుండా ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సహాయం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని, సంక్షేమాన్ని ఆర్థిక విధ్వంసంగా చిత్రీకరించడం సరైన దృక్పథం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మాత్రమే సంక్షేమంపై ప్రతికూల ప్రచారం జరుగుతోందని, దీనికి కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా కారణమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు సంక్షేమం అందించడాన్ని తప్పుబట్టే వారు, పెద్ద పారిశ్రామిక వేత్తలకు భూములు, పన్ను రాయితీలు, వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని మాత్రం ప్రశ్నించడం లేదని విమర్శకులు పేర్కొంటున్నారు.
బడా పారిశ్రామిక వేత్తలకు భారీ రాయితీలు కల్పించడం అభివృద్ధిగా కనిపిస్తే, పేదలకు సంక్షేమం అందించడం మాత్రమే ఆర్థిక భారంగా చూపించడం ప్రభుత్వాల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సంక్షేమ పథకాలను నేరుగా ఓట్లతో ముడిపెట్టి చూడటమే అపరిపక్వ రాజకీయ ఆలోచనకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే వ్యాఖ్యలకంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు.





