---Advertisement---

ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా.. మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన

June 28, 2026

Summarize with AI

---Advertisement---

బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి(Former Prime Minister), అవామీ లీగ్ (Awami League) అధినేత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలోనే తాను స్వదేశమైన బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు. తాజాగా ఓ జాతీయ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించారు. తనపై మరణశిక్ష (Death Penalty) తీర్పు అమల్లో ఉన్నప్పటికీ, అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగుతున్నప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ (Sheikh Mujibur Rahman) కుమార్తె అయిన షేక్ హసీనా (Sheikh Hasina) 2024 ఆగస్టు 5న ప్రధానమంత్రి పదవికి రాజీనామా (Resignation) చేసిన తర్వాత భారత్‌లో(India) ఆశ్రయం పొందుతూ ఉన్న విషయం తెలిసిందే.

చావుకు భయపడను.. ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగుతుంది

బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని (Dhaka) ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (International Crimes Tribunal) తనకు మరణశిక్ష విధించడంపై షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. తన స్వదేశానికి తిరిగి వెళ్లాలనే నిర్ణయం వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదని, బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ హక్కులు(Political Rights), ప్రజాస్వామ్య పునరుద్ధరణ (Democracy Restoration) కోసం అని పేర్కొన్నారు. తనపై వచ్చిన తీర్పు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆరోపించారు.

1975లో తన కళ్లముందే తల్లిదండ్రులు, సోదరులు సహా కుటుంబ సభ్యులంతా హత్యకు(Murder) గురయ్యారని గుర్తు చేసుకున్నారు. అనంతరం తనపై ఎన్నో గ్రెనేడ్ దాడులు, హత్యాయత్నాలు, రాజకీయ కుట్రలు జరిగినా ఎన్నడూ వెనక్కి తగ్గలేదన్నారు. చావుకు భయపడే వ్యక్తిని తాను కాదని, అన్ని అడ్డంకులను అధిగమించి 2026లోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాననే విశ్వాసం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

అవామీ లీగ్‌ను ఎవరూ అణచలేరు

ప్రస్తుతం మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, బీఎన్‌పీ (BNP) ప్రభావంతో దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని షేక్ హసీనా విమర్శించారు. 77 సంవత్సరాల చరిత్ర కలిగిన అవామీ లీగ్‌ను ఎవరూ అంతం చేయలేరని స్పష్టం చేశారు. తమ పార్టీ కేవలం కాగితాలపై ఉన్న రాజకీయ సంస్థ కాదని, బెంగాల్ నేలలో, అక్కడి ప్రజల గుండెల్లో బలమైన వేర్లు పాతుకున్న ఉద్యమమని పేర్కొన్నారు.

తమ పార్టీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా, రాజకీయ వేధింపులకు గురిచేసినా అవామీ లీగ్ వెనక్కి తగ్గదని అన్నారు. ప్రజల మద్దతుతో తమ పార్టీ మళ్లీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment