ఈ వారం ఓటీటీల్లో(OTT) మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్ రెడీ అయిపోయాయి. జూలై 13 నుంచి 19 వరకు ఏకంగా 20కు పైగా సినిమాలు(Movies), సిరీస్‌లు (Series) వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుండగా.. ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు కూడా ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి రానుంది.
గత వారం రిలీజైన ‘లెనిన్'(Lenin) థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. ఈ వీకెండ్ ఐశ్వర్యా రాజేశ్ నటించిన ‘ఓ సుకుమారి’, మాధవన్ ‘జీడీఎన్’, ‘వదలా’, ‘రాజా ది రాజా’, ‘ఆపరేషన్ అరుణారెడ్డి’, ‘మహేంద్రగిరి వారాహి’ వంటి తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన భారీ చిత్రం ‘ద ఒడిస్సీ’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఓటీటీల విషయానికి వస్తే.. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం'(Maa Inti Bangaram), వడ్డే నవీన్ నటించిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu)పై మంచి అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు రియాలిటీ షోలు, డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ, ఏ తేదీన స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.
హాట్‌స్టార్ (Disney+ Hotstar)– 6 రిలీజ్‌లు
- సెకండ్ లవ్ (తమిళ రియాలిటీ సిరీస్) – జూలై 13
- పవిత్రం (మలయాళ సిరీస్) – జూలై 13
- వుథరింగ్ హైట్స్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 13
- రెడీ ఆర్ నాట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 16
- మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) – జూలై 17
- టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) – జూలై 18
నెట్‌ఫ్లిక్స్ (Netflix) – 8 రిలీజ్‌లు
- ద హాక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 15
- మీ బిఫోర్ మీ (ఇండోనేసియన్ మూవీ) – జూలై 16
- ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) – జూలై 17
- ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) – జూలై 17
- డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 17
- 23000 లైవ్స్ (జర్మన్ మూవీ) – జూలై 17
- హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 17
- స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) – జూలై 18
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) – 3 రిలీజ్‌లు
- మర్డర్ 101 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – జూలై 13
- బ్యాక్ రూమ్స్ (ఇంగ్లీష్ సినిమా – రెంట్) – జూలై 14
- రైడ్ ఆర్ డై (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 15
జీ5 (ZEE5) – 1 రిలీజ్
- ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) – జూలై 17
ఎంఎక్స్ ప్లేయర్ (MX Player) – 1 రిలీజ్
- రక్తాంచల్ సీజన్ 3 (హిందీ సిరీస్) – జూలై 16
ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+) – 1 రిలీజ్
- లక్కీ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 15
మొత్తంగా ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు సినిమాల నుంచి హాలీవుడ్, కొరియన్, స్పానిష్, ఇండోనేసియన్ కంటెంట్ వరకు అన్ని రకాల వినోదం ఒకే వారం అందుబాటులోకి వస్తుండటంతో మూవీ లవర్స్‌కు ఇది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వీక్ కానుంది.







