రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి సోషల్ మీడియాలో తన క్రేజ్ ఏంటో నిరూపించారు. థియేటర్లలోనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా తన హవా కొనసాగుతుందని ‘ఫౌజీ’(Fauji) ఫస్ట్ లుక్ పోస్టర్‌తో (First Look Poster) చూపించారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసి, భారతీయ సినీ ప్రమోషన్లలో కొత్త చరిత్ర సృష్టించింది.
తాజా గణాంకాల ప్రకారం ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే 5.33 లక్షల షేర్లు సాధించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా షేర్ చేయబడిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌గా కొత్త రికార్డును నెలకొల్పింది. అభిమానులు భారీ ఎత్తున పోస్టర్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో డిజిటల్ సంబరాలు జరిపారు. ఈ రికార్డు ప్రభాస్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు మరో నిదర్శనంగా నిలిచింది.
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి ప్రభాస్ మరో హీరో రికార్డును కాదు, తన సొంత రికార్డునే బద్దలు కొట్టారు. గతంలో ‘స్పిరిట్’(Spirit) ఫస్ట్ లుక్ పోస్టర్ 5.19 లక్షల షేర్లతో టాప్‌లో ఉండగా, ఇప్పుడు ‘ఫౌజీ’ 5.33 లక్షల షేర్లతో ఆ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ ఆధిపత్యం మరింత బలపడిందనే చర్చ మొదలైంది.
ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రభాస్ లుక్. యుద్ధంలో గాయాలతో కనిపించిన ఆయన గెటప్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. పోస్టర్‌లో కనిపించిన ఇంటెన్స్ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్‌కు అద్భుతమైన స్పందన రావడంతో ‘ఫౌజీ’పై హైప్ మరింత పెరుగుతోంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ వార్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోంది. ప్రభాస్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ‘ఫౌజీ’ సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది.








