---Advertisement---

ఏపీలో శాంతిభద్రతలు కుప్పకూలాయంటు పార్లమెంట్‌లో ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం.

July 20, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) వరుసగా చోటుచేసుకుంటున్న పోలీస్ కస్టడీ మరణాలు (Police Custody Deaths), లాకప్ డెత్స్(Lockup Deaths), అలాగే రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల (Law And Order) పరిస్థితిపై తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (YSRCP MP) డా. మద్దల గురుమూర్తి (Dr. Maddila Gurumurthy) లోక్‌సభలో (Lok Sabha) వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అంశంపై తక్షణ చర్చ జరపాలని కోరుతూ ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల(Police) అదుపులో ఉన్న వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకరమని ఎంపీ పేర్కొన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే ప్రాణహాని కలిగించే స్థితికి చేరుకోవడం ప్రజాస్వామ్యానికి (Democracy) ప్రమాదకర సంకేతమని ఆయన తన నోటీసులో వివరించారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

లాకప్ మరణాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు పూర్తిగా నియంత్రణ తప్పాయని, రాజకీయ కక్షసాధింపులు మరియు సామాన్యులపై దాడులు పెరిగిపోతున్నాయని గురుమూర్తి ఆరోపించారు. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభ నిబంధనల ప్రకారం అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రజా సమస్యలపై ఇతర కార్యకలాపాలను నిలిపివేసి చర్చ జరిపేందుకు ఈ వాయిదా తీర్మానాన్ని సమర్పించినట్లు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో (Parliament) చర్చ జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment