ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయ వేధింపులు (Political Harassment), అక్రమ కేసులు (Illegal Cases), పోలీసు చర్యలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. రాప్తాడు నియోజకవర్గానికి (Raptadu Constituency) చెందిన వైఎస్సార్సీపీ(YSRCP) కార్యకర్త అంకె నరేంద్ర (Anke Narendra) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
అంకె నరేంద్రపై (Anke Narendra) ఆలమూరు జగనన్న కాలనీలో జరిగిన ఇంటి సామాగ్రి చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే తనకు ఆ దొంగతనంతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం వైసీపీ కార్యకర్త అయినందుకే తప్పుడు కేసు బనాయించారని ఆయన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ(TDP) నేతల ఆదేశాలతో పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని, గ్రామంలోకి అడుగు పెట్టనివ్వడం లేదని, ఎస్ఐఆర్లో (SIR) దొంగ ఓట్ల నమోదును అడ్డుకున్నందుకే తనపై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని నరేంద్ర ఆరోపించారు.
ఆలమూరు గ్రామంలోని అరటి తోటలో సెల్ఫీ వీడియో (Selfie Video) తీసుకుంటూ పురుగుల మందు తాగిన నరేంద్రను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (Thopudurthi Prakash Reddy) దగ్గరుండి వైద్య చికిత్సకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
సెల్ఫీ వీడియోలో నరేంద్ర చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. టీడీపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ(Gonuguntla Suryanarayana), హౌసింగ్ ఏఈ సంపత్ కుమార్ (Sampath Kumar) కలిసి తనను “మోటార్ల దొంగ”(Motor Thief)గా చిత్రీకరించారని, తమ కుటుంబాన్ని గ్రామంలో అవమానపరిచారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి వాల్మీకి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారని, అలాంటి కుటుంబంపై నేర ముద్ర వేయడం తట్టుకోలేకపోతున్నానని చెప్పారు.
ఇటీవల ఇలాంటి ఆరోపణల మధ్య చోటుచేసుకున్న ఇతర ఘటనలు కూడా ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. నరకులపాడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చిన్న గోపి అలియాస్ చిన్నీ (Chinna Gopi Alias Chinni) ఆత్మహత్య చేసుకున్న ఘటన, రెంటపాళ్లలో నాగ మల్లేశ్వరరావు (Naga Malleswara Rao) ఆత్మహత్య, వ్యాపారి లక్ష్మీనారాయణ (Lakshminarayana) ఆత్మహత్యాయత్నం, ఏలూరు జిల్లాలో సోషల్ మీడియా కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (Yelamanchili Praveen) ఉరేసుకుని మృతి చెందిన ఘటనలు రాజకీయ వేధింపుల కోణంలో ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ ఘటనలన్నింటిపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రాజకీయ కక్ష సాధింపుతో కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.






