---Advertisement---

పంచదార్ల కొండలను కాపాడండి: ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

July 21, 2026

Summarize with AI

---Advertisement---

అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల ప్రాంతాన్ని “నో మైనింగ్ జోన్”గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీతో పంచదార్ల కొండకు బయలుదేరింది. ఒకవైపు సింహాచలం కొండ, మరోవైపు పంచదార్ల కొండను తవ్వేస్తున్నారని, కనిపించిన ప్రతి కొండను గుండు చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

పంచదార్ల కొండ మహాభారత కాలం నాటి పవిత్ర శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఏడాది పొడవునా కొండపై నుంచి ప్రవహించే ఐదు జలధారల కారణంగానే ఆ ప్రాంతానికి “పంచదార్ల” అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల ఆ ప్రాంతంలోని జల వనరులు దెబ్బతిన్నాయని, శుభ్రమైన నీటి స్థానంలో బురద నీళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్ కొనసాగితే పర్యావరణం, ఆధ్యాత్మిక వారసత్వం, స్థానిక జీవన విధానం పూర్తిగా నాశనం అవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పంచదార్ల ప్రాంతాన్ని “నో మైనింగ్ జోన్”గా ప్రకటించాలని, లేదంటే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ ప్రకటించింది. అయితే ఈ ప్రకృతి విధ్వంసంపై పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేనకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంతో, “మైనింగ్ వెనుక ఎవరి గూడుపుఠానీ ఉంది?” అనే ప్రశ్నలను ప్రజలే బహిరంగంగా లేవనెత్తుతున్న పరిస్థితి నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment