---Advertisement---

“రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి”: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

July 20, 2026

Summarize with AI

---Advertisement---

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రైతులను(Farmers) పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, యూరియా(Urea) కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై (Pocharam Srinivas Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాన్సువాడలో మరోసారి గులాబీ జెండా ఎగరేసే సమయం వచ్చిందని ఆయన అన్నారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్(BRS) తరఫున గెలిచి పార్టీ మారారని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో లేదని ఆయనకు అర్థమైందన్నారు. కుడితిలో పడిన ఎలుకలా పోచారం పరిస్థితి తయారైందని, ఇకపై ఏ ఎన్నికలు జరిగినా ఆయన ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

తాను ప్రాణం ఉన్నంత వరకు పార్టీ మారనని చెప్పిన పోచారం చివరకు మాట తప్పి కాంగ్రెస్‌లో చేరారని కేటీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు స్పీకర్‌గా (Speaker) పనిచేసిన వ్యక్తి ఇప్పుడు తాను ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారని విమర్శించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను (Promises) అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా చేతులెత్తేశారని అన్నారు. దేవుళ్లపై ఒట్లు పెట్టి కూడా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏ సభ జరిగినా కేసీఆర్‌ను విమర్శించడమే సీఎం ప్రధాన లక్ష్యంగా మారిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. షాపుల్లో ఎరువుల సంచులు లేకపోతే యాప్‌లో కనిపించినా రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రశ్నించారు. ఢిల్లీకి (Delhi) పంపేందుకు యూరియా సంచులు (Bags) అందుబాటులో ఉంటున్నాయని, కానీ తెలంగాణ రైతులకు మాత్రం సరిపడా ఎరువులు అందడం లేదని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 2 పిల్లర్లు కుంగి 31 నెలలు గడిచినా ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. కన్నెపల్లి (Kannepalli) నుంచి ప్రతిరోజూ నీరు కిందకు వెళ్తున్నా పంపింగ్ చేయడం లేదని ఆరోపించారు. రిజర్వాయర్లు (Reservoirs) డెడ్ స్టోరేజ్‌కు చేరుతున్నా ప్రభుత్వం మాత్రం కోల్డ్ స్టోరేజ్‌లోకి (Cold Storage) వెళ్లిపోయినట్లుగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ (Telangana) కోసం అవసరమైతే రక్తమే కాదు ప్రాణాలు కూడా ఇస్తామని బీఆర్ఎస్ ఎప్పుడూ చెప్పిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో కల్పించిన ఉద్యోగాలను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment