---Advertisement---

హైదరాబాద్‌ నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ పై వేధింపుల కలకలం!

July 19, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్‌లోని (Hyderabad) సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) (SVPNPA)లో సంచలనం రేపే లైంగిక వేధింపుల (Sexual Harassment) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి (Trainee IPS Officer) ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుమ(Suma) అనే లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి (Lady Trainee IPS Officer) అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

బాధిత అధికారిణి ఫిర్యాదు ప్రకారం, నిందితుడు తనను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే తనకు తెలియకుండా వ్యక్తిగత(Personal), ప్రైవేట్ వీడియోలను (Private Videos) చిత్రీకరించాడని ఆరోపించారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు ఆమె పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఆ వీడియోలను ఇప్పటికే తన భర్తకు పంపించి మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఘటనతో శిక్షణలో ఉన్న ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల ప్రవర్తనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బాధితురాలి లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు (Attapur Police) ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులు(Sexual Harassment), బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైప్రొఫైల్ కేసుపై పోలీసులు గోప్యంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment