సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా (Krishna Grandson), రమేష్ బాబు (Ramesh Babu) తనయుడిగా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ ఘట్టమనేనిపై (Jayakrishna Ghattamaneni) ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram) మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానుండగా, రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) కూడా హీరోయిన్‌గా టాలీవుడ్‌లో డెబ్యూ ఇస్తోంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో కిరణ్ (Kiran) నిర్మించిన ఈ చిత్రం జూలై 30న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా జయకృష్ణకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) స్పెషల్ వీడియో విడుదల చేశారు. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) లాంటి లెజెండరీ బ్యానర్‌లో జయకృష్ణ హీరోగా పరిచయం అవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా కోసం తమ ఫ్యామిలీ మొత్తం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోందని, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా జయకృష్ణ, రాషా ఇద్దరి పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ చేసిందని ప్రశంసించారు.
ముఖ్యంగా సినిమాలోని ‘అల్లెల్లి’ సాంగ్ (Allelli Song) తనకు చాలా నచ్చిందని మహేష్ వెల్లడించారు. అలాగే తన కెరీర్‌లో తొలి సినిమా ‘రాజకుమారుడు’(Rajakumarudu) కూడా జూలై 30నే విడుదలైందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే తేదీన ‘శ్రీనివాస మంగాపురం’ను రిలీజ్ చేయడం వెనుక నిర్మాత అశ్వినీదత్ (Ashwini Dutt) గారి సెంటిమెంట్ లేదా ప్లాన్ ఉండొచ్చని సరదాగా కామెంట్ చేశారు.
తాను, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్ ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యామని, అది తమ అదృష్టమని మహేష్ అన్నారు. ఇప్పుడు అదే బ్యానర్ నుంచి వస్తున్న జయకృష్ణ, రాషా కూడా చాలా లక్కీ అని చెప్పి, అభిమానులంతా వారికి పూర్తి సపోర్ట్ ఇవ్వాలని కోరారు. జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించగా, జూలై 30న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






