ప్రపంచ (World) ప్రఖ్యాత పర్వతారోహకుడు (Mountaineer), నేపాల్‌కు చెందిన నిర్మల్ పూర్జా (Nirmal Purja) (నిమ్స్‌దాయ్) పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని (POK) బ్రాడ్ పీక్ పర్వతంపై (Broad Peak) సంభవించిన భారీ మంచు చరియల ప్రమాదంలో (Avalanche Accident) దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని ఆయన స్థాపించిన సాహస యాత్రల సంస్థ ఎలైట్ ఎక్స్‌పెడ్ (Elite Exped) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో నిర్మల్ పూర్జాతో పాటు మరో 5 మంది పర్వతారోహకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
ప్రపంచంలో 12వ అత్యంత ఎత్తైన శిఖరమైన బ్రాడ్ పీక్‌పై శుక్రవారం భారీ మంచు చరియ విరిగిపడడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. గాలింపు చర్యల అనంతరం నిర్మల్ పూర్జా మరణాన్ని సంస్థ ధ్రువీకరించింది. ఆయనతో పాటు సహచరులు పూర్ బహదూర్ గురుంగ్ (Poor Bahadur Gurung) (యుక్తా), నిమా షెర్పా (Nima Sherpa) కూడా మృతి చెందినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు ఎలైట్ ఎక్స్‌పెడ్ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
పర్వతారోహణ రంగంలో నిర్మల్ పూర్జా అసాధారణ విజయాలు సాధించారు. 2019లో ‘ప్రాజెక్ట్ పాసిబుల్'(Project Possible) ద్వారా ప్రపంచంలోని 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న మొత్తం 14 శిఖరాలను కేవలం 6 నెలలు 6 రోజుల్లో అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2021లో 10 మంది నేపాలీ పర్వతారోహకుల బృందంతో కలిసి కే2 పర్వతాన్ని శీతాకాలంలో తొలిసారిగా విజయవంతంగా అధిరోహించిన బృందంలో సభ్యుడిగా నిలిచారు.
బ్రిటన్ బ్రిగేడ్ ఆఫ్ గుర్ఖాస్, అనంతరం రాయల్ మెరైన్స్ స్పెషల్ బోట్ సర్వీస్‌లో సేవలందించిన నిర్మల్ పూర్జా.. అనంతరం పూర్తి స్థాయి పర్వతారోహకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన జీవిత గాథ ఆధారంగా రూపొందిన ’14 Peaks: Nothing Is Impossible’ డాక్యుమెంటరీ ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.








