---Advertisement---

Vincent Pastore | సినీ ఇండ‌స్ట్రీలో విషాదం.. ‘ది సోప్రానోస్’ ఫేమ్‌ విన్సెంట్ పాస్టోర్ కన్నుమూత..!

August 2, 2026

Summarize with AI

---Advertisement---

హాలీవుడ్ సినీ పరిశ్రమలో (Hollywood Film Industry) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రైమ్ డ్రామా అభిమానులను అలరించిన ప్రముఖ సిరీస్ ‘ది సోప్రానోస్’(The Sopranos) ద్వారా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు విన్సెంట్ పాస్టోర్ (Vincent Pastore) (80) కన్నుమూశారు. న్యూయార్క్‌లోని (New York) తన నివాసంలో ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చిన సన్నిహితులు వెళ్లి చూడగా ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన మరణానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

‘ది సోప్రానోస్’ సిరీస్‌లో ‘సల్వతోర్ బిగ్ పుస్సీ బాన్‌పెన్సియెరో’ పాత్రతో విన్సెంట్ పాస్టోర్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన హాలీవుడ్‌లో టఫ్ గై ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ‘గుడ్‌ఫెల్లాస్’(Goodfellas), ‘కార్లిటోస్ వే’(Carlito’s Way), ‘షార్క్ టేల్’(Shark Tale) వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు తన సినీ కెరీర్‌లో 150కు పైగా సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించి చిరస్థాయిగా నిలిచారు.

విన్సెంట్ పాస్టోర్ ఆకస్మిక మరణంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తూ భావోద్వేగ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. క్రైమ్ డ్రామా ప్రపంచంలో ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment