యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా తమిళ హీరో ధృవ్ విక్రమ్‌తో (Dhruv Vikram) ఆమె ప్రేమలో ఉన్నారని, ఇటీవల ఇద్దరూ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ బ్రేకప్ కారణంగానే అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఎమోషనల్ పోస్టులు (Emotional Posts) పెడుతోందని నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా ఈ ప్రచారాలపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఏం పోస్ట్ చేయాలనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని (Personal Decision) స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ సానుభూతి కోసం తన బాధను బయటపెట్టే వ్యక్తిని కాదని, ఒక సాధారణ మహిళ(Women) జీవితంలో జరిగే మార్పుల గురించి మాత్రమే ఆ పోస్టుల్లో ప్రస్తావించానని వెల్లడించారు.
సమాజంలో మహిళలు ఎదుర్కొనే మార్పుల గురించి బహిరంగంగా మాట్లాడటంలో తనకు ఎలాంటి సంకోచం లేదని, అలాంటి విషయాలను పంచుకోవడం గర్వంగా భావిస్తున్నానని అనుపమ చెప్పారు. తన వ్యక్తిగత జీవితం గురించి అసలు ఏమాత్రం తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం సరైంది కాదని మండిపడ్డారు. “ఇది నా ఇన్స్టాగ్రామ్ (This Is My Instagram). నాకు నచ్చినది నేను పోస్ట్ చేస్తాను. నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అంటూ ఘాటుగా స్పందించారు.
సినిమాల విషయానికి వస్తే, రొటీన్ కథలకు దూరంగా కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ అనుపమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘క్రేజీ కళ్యాణం'(Crazy Kalyanam) చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, నరేష్ వీకే, అఖిల్ ఉడ్డెమారి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఒకవైపు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు సూటిగా చెక్ పెట్టిన అనుపమ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.






