---Advertisement---

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?.. అసలు వాస్తవం ఇదే!

August 6, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా (Brand Ambassador) నియమించబోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చిరంజీవి ఇమేజ్‌ను వినియోగించుకోనున్నట్లు ప్రచారం జరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందంటూ అనేక కథనాలు చక్కర్లు కొట్టాయి.

గతంలో గుజరాత్ పర్యాటక రంగానికి (Gujarat Tourism Sector) బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చిరంజీవిని రంగంలోకి దింపనున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో మరింత వేగంగా వ్యాపించాయి. దీంతో అభిమానుల్లోనూ ఈ వార్తపై ఆసక్తి పెరిగింది.

అయితే ఈ ప్రచారంపై చిరంజీవి పీఆర్ బృందం (Chiranjeevi PR Team) స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవిని నియమించడంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు, నిర్ణయాలు జరగలేదని తేల్చి చెప్పింది.

అధికారిక సమాచారం లేకుండా ప్రచారంలోకి వస్తున్న వార్తలను నమ్మవద్దని అభిమానులతో పాటు ప్రజలకు పీఆర్ బృందం విజ్ఞప్తి చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఈ ప్రచారానికి పూర్తిగా చెక్ పడినట్టైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment