---Advertisement---

నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ …మాస్ అవతార్‌లో నాని విధ్వంసం!

August 6, 2026

Summarize with AI

---Advertisement---

న్యాచురల్ స్టార్ నాని(Nani) కెరీర్‌లో దసరా సినిమాతో భారీ మలుపు తీసుకొచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela).. ఇప్పుడు తన రెండో సినిమాగా తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్‌’తో(The Paradise) మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు కేవలం ఒక్క సినిమానే తెరకెక్కించినా.. ఈ దర్శకుడి క్రేజ్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయికి చేరుకుంది. ఎస్ఎల్‌వి సినిమాస్(SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.

ఈ రోజు విడుదలైన ది ప్యారడైజ్ టీజర్‌లో (The Paradise Teaser) నాని కనిపించిన అవతార్ చూస్తే.. గతంలో హిట్ 3లో కనిపించిన వయొలెంట్ లుక్ కూడా చిన్నదిగా అనిపించేలా ఉంది. టీజర్ మొత్తం రా యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్, బ్లడ్ బాత్ విజువల్స్‌తో నిండిపోయింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానిని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ప్రెజెంట్ చేసినట్లు టీజర్ స్పష్టంగా చూపించింది.

టీజర్‌లో వినిపించిన 3 నుంచి 4 డైలాగ్స్ సినిమాపై ఉన్న హైప్‌ను డబుల్ చేసేలా ఉన్నాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నాని స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment