భారత మహిళా బాక్సర్ సాక్షి ధండా (Sakshi Dhandha) కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. 51 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ బాక్సర్ రూబీ వైట్‌ను ఓడించి భారత్‌కు(India) బంగారు పతకాన్ని (Gold Medal) అందించింది. హర్యానాకు చెందిన సాక్షి.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన విజయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తన విజయానికి భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అందించిన సహకారం ఎంతో ఉందని సాక్షి తెలిపింది. విరాట్ కోహ్లీ కారణంగానే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని పేర్కొంది.
విరాట్ కోహ్లీ గత 3 సంవత్సరాలుగా తనకు అండగా నిలిచినట్లు సాక్షి వెల్లడించింది. కోహ్లీ ఫౌండేషన్ (Kohli Foundation) ద్వారా తనకు ఆర్థిక సహకారం (Financial Support) అందించడంతో పాటు, బాక్సింగ్‌లో(Boxing) మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారని తెలిపింది. అంతేకాకుండా తనకు స్పాన్సర్‌గా కూడా విరాట్ కోహ్లీ వ్యవహరించారని చెప్పింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో (Commonwealth Games) స్వర్ణ పతకం సాధించిన అనంతరం తన విజయానికి సహకరించిన విరాట్ కోహ్లీకి సాక్షి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. తనకు ఎంతో అండగా నిలిచిన ఆయన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది.
తాను బాక్సింగ్‌లోకి రావడానికి బాక్సింగ్ దిగ్గజం విజయేందర్ సింగ్(Vijender Singh) స్ఫూర్తిగా నిలిచారని సాక్షి చెప్పింది. అయితే మైదానంలోకి దిగిన తర్వాత విరాట్ కోహ్లీ తరహాలో దూకుడుగా, క్రమశిక్షణతో ముందుకు సాగాలని భావించానని తెలిపింది. అదే పట్టుదలతో శ్రమించి ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించానని సాక్షి పేర్కొంది.








