---Advertisement---

హాకీ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..టాప్-8లో టీమిండియా!

August 20, 2026

Summarize with AI

---Advertisement---

అమ్స్‌టెల్వీన్‌లో(Amstelveen) జరిగిన హాకీ వరల్డ్ కప్ 2026(Hockey World Cup 2026) పూల్-డీ మ్యాచ్‌లో(Pool-D Match) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై(Pakistan) భారత్(India) అదిరిపోయే విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 5-3తో పాకిస్థాన్‌ను చిత్తు చేసి టోర్నీలో టాప్-8లో చోటు ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత ఈ విజయం భారత జట్టుకు భారీ ఊరటనిచ్చింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) నేతృత్వంలోని భారత జట్టు తొలి క్వార్టర్ నుంచే పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచింది. వరుస దాడులతో ప్రత్యర్థి రక్షణను ఇబ్బంది పెట్టిన భారత్ మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించింది.

హర్మన్‌ప్రీత్, అభిషేక్ మెరుపులు

భారత్ విజయంలో హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ (Abhishek) కీలక పాత్ర పోషించారు. హర్మన్‌ప్రీత్ 2 గోల్స్, అభిషేక్ 2 గోల్స్ సాధించగా, హార్దిక్ సింగ్ మరో గోల్ చేశాడు. దీంతో భారత్ ఖాతాలో మొత్తం 5 గోల్స్ చేరాయి.

రెండో క్వార్టర్‌లో గోల్స్ వర్షం

20వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను (Penalty Corner) గోల్‌గా మలిచి భారత్‌ను 3-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 21వ నిమిషంలో షాహిద్ హన్నన్ పాకిస్థాన్ ఖాతా తెరిచాడు. 23వ నిమిషంలో అభిషేక్ మరో గోల్ చేయడంతో భారత్ 4-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 24వ నిమిషంలో సుఫ్యాన్ ఖాన్ గోల్ చేయడంతో పాకిస్థాన్ స్కోరును 4-2కు తగ్గించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 4-2తో ఆధిక్యంలో నిలిచింది.

హార్దిక్ గోల్‌తో భారత్‌కు బలం

మూడో క్వార్టర్‌లో హార్దిక్ సింగ్ పెనాల్టీ అవకాశాన్ని గోల్‌గా మలచడంతో భారత్ 5-2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించినా భారత రక్షణను ఛేదించలేకపోయింది.

చివర్లో పాక్ పోరాటం

45వ నిమిషంలో షాహిద్ హన్నన్ తన రెండో గోల్ చేయడంతో స్కోరు 5-3కు చేరింది. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగినా చివరి నిమిషాల్లో భారత డిఫెన్స్ పటిష్టంగా నిలిచింది. పాకిస్థాన్‌కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా భారత్ మ్యాచ్‌ను విజయవంతంగా ముగించింది.

టాప్-8లో టీమిండియా

పాకిస్థాన్‌పై 5-3 విజయంతో భారత్ హాకీ వరల్డ్ కప్ 2026లో టాప్-8లో చోటు దక్కించుకుంది. హర్మన్‌ప్రీత్, అభిషేక్, హార్దిక్ కీలక సమయంలో గోల్స్ చేయడంతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో భారత జట్టు ప్రపంచకప్ తదుపరి దశకు దూసుకెళ్లింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment