---Advertisement---

మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌కు కీలక బాధ్యత.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా నియామకం..!

August 12, 2026

Summarize with AI

---Advertisement---

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (Former Chief Justice of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice D.Y. Chandrachud) అంతర్జాతీయ న్యాయ వేదికపై కీలక బాధ్యతను స్వీకరించనున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఓస్చాడ్‌బ్యాంక్ (Oschadbank) రష్యాపై (Russia) దాఖలు చేసిన భారీ అంతర్జాతీయ వివాదంలో రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా (Arbitrator) ఆయన వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని గ్లోబల్ ఆర్బిట్రేషన్ రివ్యూ నివేదికను ఉటంకిస్తూ బార్ అండ్ బెంచ్ (Bar & Bench) వెల్లడించింది.

2022లో రష్యా ఉక్రెయిన్‌పై (Russia-Ukraine) ప్రారంభించిన పూర్తిస్థాయి సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు, ఆస్తులను పూర్తిగా కోల్పోయామని ఓస్చాడ్‌బ్యాంక్ ఆరోపిస్తోంది. ఈ కారణంగా తమకు వందల మిలియన్ డాలర్ల మేర భారీ నష్టం వాటిల్లిందని బ్యాంక్ పేర్కొంది.

1998లో కుదిరిన రష్యా-ఉక్రెయిన్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఓస్చాడ్‌బ్యాంక్ కోరింది. 2025 జూలైలో రష్యాకు న్యాయపరమైన నోటీసు (Legal Notice) పంపినప్పటికీ అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో బ్యాంక్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

ఈ కేసు విచారణ కోసం 3 సభ్యులతో కూడిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను (Arbitration Tribunal) ఏర్పాటు చేశారు. కోస్టారికా మాజీ వాణిజ్య మంత్రి, ప్రముఖ ఆర్బిట్రేటర్ డయాలా జిమెనెజ్‌ను (Dyalá Jiménez) రష్యా, ఓస్చాడ్‌బ్యాంక్ కలిసి ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా ఎంపిక చేశాయి.

గ్రీక్ ఆర్బిట్రేటర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రేకౌలాకిస్‌ను ఓస్చాడ్‌బ్యాంక్ తన ప్రతినిధిగా నియమించుకుంది. మరోవైపు రష్యా తన ప్రతినిధిగా భారత మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఎంపిక చేసింది.

గతంలో వింటర్‌షాల్ డియా, ఉక్రెనెర్గోకు సంబంధించిన వివాదాల్లో కూడా రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాలని జస్టిస్ చంద్రచూడ్‌ను కోరినప్పటికీ ఆయన ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. అయితే ప్రస్తుత ఓస్చాడ్‌బ్యాంక్ కేసులో రష్యా చేసిన అభ్యర్థనను ఆయన అంగీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment