---Advertisement---

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి?పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..!

August 12, 2026

Summarize with AI

---Advertisement---

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం పాకిస్థాన్‌లో (Pakistan) కలకలం రేపుతోంది. రావల్పిండిలోని అడియాలా జైలులో (Adiala Jail, Rawalpindi) ఉన్న ఆయన కన్నుమూశారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయన మృతిపై అధికారిక ధ్రువీకరణ లేదు.

అమెరికాలో (USA) ఉన్న పాకిస్థానీ జర్నలిస్ట్ (Pakistani Journalist) వజాహత్ సయీద్ ఖాన్ (Wajahat Saeed Khan) వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. పాకిస్థాన్ ఆర్మీకి(Pakistan Army) చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు ఇమ్రాన్ ఖాన్ జీవించి ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే వారు స్వయంగా చూసి నిర్ధారించలేదని స్పష్టం చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌ను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలు, వ్యక్తిగత వైద్యులు కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై (Health) ఆందోళన వ్యక్తమవుతోంది. స్వతంత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది.

ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతించకపోతే భారీ ఆందోళనలు చేపడతామని పీటీఐ (PTI) హెచ్చరించింది. సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌కు మార్చ్ (Islamabad March) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది (Sohail Afridi) 20 లక్షల మంది ప్రజలు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు 5 నుంచి జైలులో ఉన్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో (Al-Qadir Trust Case) ఆయనకు 14 ఏళ్ల శిక్ష విధించగా, ఆయన భార్య బుష్రా బీబీకి (Bushra Bibi) 2025 జనవరిలో 7 ఏళ్ల శిక్ష పడింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో విభేదాల నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్‌పై చర్యలు పెరిగాయనే వాదనలు ఉన్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment