---Advertisement---

జస్టిస్ యశ్వంత్ వర్మకు బిగ్ షాక్.. మూడు ఆరోపణలు రుజువన్న విచారణ కమిటీ..!

August 12, 2026

Summarize with AI

---Advertisement---

ఢిల్లీలోని (Delhi) జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Varma) అధికారిక నివాసంలో నగదు కట్ల (Cash Bundles) వ్యవహారంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ (Inquiry Committee) సంచలన నివేదిక ఇచ్చింది. ఆయనపై వచ్చిన మూడు ప్రధాన ఆరోపణలూ రుజువయ్యాయని (Proved) తేల్చింది. లెక్కల్లోకి రాని భారీ నగదు లభించడం, కీలక ఆధారాలను సక్రమంగా భద్రపరచకపోవడం, ఈ వ్యవహారంపై ఇచ్చిన వివరణలు అసంపూర్తిగా ఉండటం వంటి ఆరోపణలు నిర్ధారణ అయ్యాయని పేర్కొంది.

అయితే ఆ నగదు వ్యక్తిగతంగా జస్టిస్ వర్మకు చెందినదని కమిటీ నిర్ధారించలేదు. ఆయన అధికారిక నివాసంలోని నిల్వ గదిలో గణనీయమైన మొత్తంలో వివరాలు లేని నగదు కనిపించిందని, దాని మూలం, యాజమాన్యం, అక్కడ ఎందుకు ఉందనే విషయాలను ఆయన సంతృప్తికరంగా వివరించలేకపోయారని స్పష్టం చేసింది.

2025 మార్చి 14న 30 తుగ్లక్ క్రెసెంట్‌లోని (30 Tughlak Crescent) జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పే సమయంలో నిల్వ గదిలో రూ.500 నోట్ల కట్టలు(Bundles of ₹500 Notes), భారీగా నగదు కనిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Chief Justice Sanjiv Khanna) అంతర్గత విచారణకు ఆదేశించారు. అనంతరం జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.

కమిటీ విచారణలో మూడు అంశాలు కీలకంగా నిలిచాయి.

  1. నిల్వ గదిలో (Storeroom) భారీగా లెక్కల్లోకి రాని నగదు ఉన్నట్లు ఆధారాలు (Evidence) లభించాయని, దాని మూలం, యాజమాన్యంపై జస్టిస్ వర్మ సరైన వివరణ ఇవ్వలేకపోయారని తెలిపింది.
  2. అగ్నిప్రమాదం (Fire Accident) తర్వాత నిల్వ గదిని వెంటనే భద్రపరచకపోవడంతో కీలక ఆధారాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే నగదును జస్టిస్ వర్మ స్వయంగా తొలగించారని నిర్ధారించలేదు.
  3. నగదు వ్యవహారంపై జస్టిస్ వర్మ ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని కమిటీ తేల్చింది.

ఈ వ్యవహారంలో నగదు ఖచ్చితమైన మొత్తం ఎంతనేది మాత్రం తేలలేదు. నగదును అధికారికంగా స్వాధీనం చేసుకుని లెక్కించకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది.

తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్ వర్మ ఖండించారు. ఘటన సమయంలో తాను అక్కడ లేనని, నగదు తనకు చెందినది కాదని వాదించారు. నగదును కావాలనే అక్కడ ఉంచి ఉండొచ్చని, కుట్ర జరిగి ఉండొచ్చని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే ఈ వాదనలకు తగిన ఆధారాలు లేవని కమిటీ తెలిపింది.

ఈ నివేదిక క్రిమినల్ కోర్టు తీర్పు (Criminal Court Verdict) కాదని, పార్లమెంట్ ద్వారా న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియకు సంబంధించినదేనని కమిటీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, పార్లమెంట్ (Parliament) ద్వారా తొలగించే పరిస్థితి ఎదురవుతున్న సమయంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనపై కొనసాగుతున్న అభిశంసన ప్రక్రియ ఆచరణాత్మకంగా ముగిసినట్లైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment