తమిళనాడులోని (Tamil Nadu) చెన్నైలో (Chennai) 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (80th Independence Day celebrations) ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రిగా విజయ్ (CM Vijay) తొలిసారి పాల్గొని జాతీయ జెండాను (National Flag) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నటి త్రిష (Trisha) కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వేడుకలకు హాజరైన త్రిష.. విజయ్ తల్లిదండ్రుల (Vijay Parents) పక్కనే కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. విజయ్(Vijay) అందరికీ సెల్యూట్ (Salute) చేస్తూ వెళ్తున్న సమయంలో త్రిష (Trisha) కూడా ఆయనకు సెల్యూట్ (Salute) చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ త్రిష పాల్గొన్నారు. తాజాగా మరోసారి అధికారిక కార్యక్రమానికి ఆమె హాజరు కావడంతో తమిళనాట ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు నుంచే వీరిద్దరూ కలిసి కనిపించడం, పలు సందర్భాల్లో మీడియా కంటపడటంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
ఇప్పుడు త్రిష వరుసగా విజయ్‌కు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తుండటంతో ఆమె రాజకీయ ప్రవేశంపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు తమిళనాట జోరుగా వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఆమె రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ పలు ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.








