తమిళనాడు (Tamil Nadu) బీజేపీ (BJP) అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ (Nainar Nagenthran) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సీఎం విజయ్ (CM Vijay) గతంలో చేసిన ‘నాన్న ఎక్కడ?’ (Where is Dad?) వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో (Assembly) ‘నాన్న ఎక్కడ.. నాన్న ఎక్కడ’ అని వెతికితే ఎలా తెలుస్తుందని, ఇంటికి వెళ్లి అడిగితేనే సమాధానం తెలుస్తుందంటూ నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సీఎం విజయ్ తల్లిని (CM Vijay’s Mother) ఉద్దేశించి అవమానకరంగా ఉన్నాయంటూ డీఎంకే(DMK), కాంగ్రెస్(Congress), టీవీకే (TVK) నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజకీయ విమర్శల్లోకి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లిని తీసుకురావడం సరికాదని మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) అన్నారు. నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బీజేపీ నేత ఖుష్బూ(Khushbu) సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) నయినార్ నాగేంద్రన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై టీవీకే కార్యకర్త, న్యాయవాది వర్తిని డీజీపీకి (DGP) ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. నయినార్ నాగేంద్రన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియోలు, పోస్టులను ఫిర్యాదుకు ఆధారాలుగా సమర్పించినట్లు సమాచారం.
నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యలతో తమిళనాడులో సీఎం విజయ్, బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








