---Advertisement---

ఆసియా కప్‌ 2026కు భారత జట్టు ప్రకటన.. జెమీమాకు గాయం, ప్రతికాకు ఛాన్స్..!

August 15, 2026

Summarize with AI

---Advertisement---

మహిళల ఆసియా కప్‌ 2026 (Women’s Asia Cup 2026) కోసం భారత జట్టును (Indian Team) బీసీసీఐ (BCCI) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును అధికారికంగా వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనుంది. స్మృతి మంధాన (Smriti Mandhana) ఎప్పటిలాగే వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

అయితే ఆసియా కప్‌ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 50 ఓవర్ల ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) గాయం (Injury) కారణంగా ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యారు. దీంతో ఆమె స్థానంలో ప్రతికా రావల్‌కు (Pratika Rawal) భారత జట్టులో చోటు దక్కింది.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు అంటే?

మహిళల ఆసియా కప్‌ 2026 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో తలపడనుంది.

ఇక భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య సెప్టెంబర్ 5న హోరాహోరీ పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఆడే మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment