---Advertisement---

కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లికి వేదిక సిద్ధమైందా?

August 18, 2026

Summarize with AI

---Advertisement---

సౌత్ ఇండియాలో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సీఈఓ కావ్య మారన్‌ (Kavya Maran) పెళ్లికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో కూడా వీరిద్దరి మధ్య పెళ్లి అంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు కూడా బయటకు రావడంతో ఈ అంశంపై ఆసక్తి మరింత పెరిగింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), కావ్య మారన్ (Kavya Maran) వివాహం నవంబర్ 10న జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకను విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా(Destination Wedding) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఇందుకోసం గ్రీస్‌ను (Greece) వేదికగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి వార్తలపై అనిరుధ్, కావ్య మారన్ లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గతంలోనూ అనిరుధ్, కావ్య మారన్‌ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో అనిరుధ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారాన్ని ఖండించిన సందర్భం ఉంది. ఇప్పుడు మరోసారి వీరి పెళ్లి వార్తలు తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్(Greece Destination Wedding), నవంబర్ 10న వివాహం అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అనిరుధ్ లేదా కావ్య మారన్ అధికారికంగా స్పందించిన తర్వాతే ఈ వార్తలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక కావ్య మారన్ విషయానికి వస్తే.. ఆమె సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ (Kalanithi Maran) కుమార్తె. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు, ఎస్ఏ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా, సహ యజమానిగా కొనసాగుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment