---Advertisement---

విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే!

August 27, 2026

Summarize with AI

---Advertisement---

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

“మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోబోతోంది” అంటూ విడుదల తేదీని ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అసలు ‘రణబాలి’ కథ ఏంటి? చరిత్రలోని ఎలాంటి ఘటనను ఈ సినిమాలో చూపించబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాతో తన ప్రత్యేకమైన మేకింగ్‌ను చూపించిన రాహుల్ సంకృత్యన్.. ‘రణబాలి’తో మరింత భారీ స్థాయిలో కథను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు అంతర్జాతీయ స్థాయి హంగులు అద్దేందుకు యానిక్ బెన్, ఆండీ లాంగ్ న్గుయెన్ వంటి ప్రముఖ స్టంట్ నిపుణులు పనిచేస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment