గత దశాబ్దంలోనే అత్యంత రక్తసిక్తమైన సంవత్సరంగా 2025 పాకిస్తాన్ (Pakistan) చరిత్రలో నమోదయ్యింది. కొత్త సంవత్సరం ఆరంభం కూడా అదే హింసాత్మక బాటలో కొనసాగుతుండటం పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) వంటి తిరుగుబాటు గ్రూపులు ప్రభుత్వంపై దాడులను ముమ్మరం చేయగా, భద్రతా దళాల ప్రతీకార చర్యలు మరింత ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ గణాంకాల (South Asia Terrorism Portal) ప్రకారం, తిరుగుబాటు సంబంధిత మరణాలు గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి.
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తాలిబాన్‌తో సంబంధాలు క్షీణించడం, సరిహద్దు ఘర్షణలు, అంతర్గత రాజకీయ–సైనిక పరిణామాలు కలిసి పాకిస్తాన్ భద్రతా పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు పోషించిన శక్తులే నేడు దేశానికే పెనుముప్పుగా మారిన ఈ పరిస్థితి, పాకిస్తాన్ భవిష్యత్తుపై గాఢమైన అనిశ్చితిని మోపుతోంది.








