ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) బీసీలకు (BCs) 34 శాతం రిజర్వేషన్లు (34% Reservations) కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వానికి (Coalition Government) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న పరిమితిని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) స్పందిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై (Chandrababu Naidu Government) విమర్శలు గుప్పించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, చివరకు వారిని మోసం చేశారని జగన్ ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు ‘మిస్టర్ 420′(Mr. 420) అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ హామీలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్(Super Six), సూపర్ సెవెన్ (Super Seven) హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో(Election Manifesto) ఇచ్చిన 143 హామీలను కూడా జగన్ ప్రస్తావించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను రద్దు చేయడం, విద్యాదీవెన(Vidya Deevena), వసతి దీవెన (Vasathi Deevena) పథకాలకు దాదాపు రూ.9 వేల కోట్ల బకాయిలు పెట్టడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ నమ్మించి మభ్యపెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా బీసీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.





