---Advertisement---

పులివెందుల బరిలోకి వైఎస్ ప్రమీలమ్మ.. భారీ ర్యాలీతో నామినేషన్!

October 16, 2026

Summarize with AI

---Advertisement---

పులివెందుల (Pulivendula) మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ (YSRCP) తరఫున వైఎస్ ప్రమీలమ్మ(YS Prameelamma) నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు(Nomination) ముందు స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలతో కలిసి దివంగత వైఎస్ జయమ్మ రాజారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy), వైఎస్ మనోహర్ రెడ్డి (YS Manohar Reddy) తదితరులు పాల్గొని ప్రమీలమ్మకు (Prameelamma) సంఘీభావం తెలిపారు. భారీ ర్యాలీతో పులివెందుల పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది.

పులివెందుల మున్సిపల్ చైర్మన్ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మను వైఎస్సార్‌సీపీ(YSRCP) అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) చిన్నమ్మ అయిన ప్రమీలమ్మ, ఇప్పటికే పులివెందులలోని అంకాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో 2014లోనూ ఆమె పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో మరోసారి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రమీలమ్మ ఎన్నికల బరిలో నిలిచారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment